Header Banner

సింహాచలం ఘటనపై సీఎం, పవన్, లోకేష్ తీవ్ర దిగ్బ్రాంతి! మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం!

  Wed Apr 30, 2025 09:58        Others

సింహాచలం ఘటన (Simhachalam tragedy)లో మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం (AP Government) ఎక్స్‌గ్రేషియా (ex-gratia) ప్రకటించింది. మృతుల (Victims) కుటుంబాలకు (Families) రూ.25 లక్షల (Rs. 25 lakhs)చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే క్షతగాత్రులకు రూ.3 లక్షల (Rs. 3 lakhs) చొప్పన పరిహారం ప్రకటించింది. బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయశాఖ పరిధిలోని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం (outsourcing job offer) ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణకు ఆదేశించింది.

 

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి (Sri Varaha Lakshmi Narasimha Swamy) చందనోత్సవం (Chandanotsavam) ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టికెట్ల కోసం వేచి ఉన్న భక్తులపై గోడ కూలి (wall collapse) 8 మంది మృతిచెందడం తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. భారీ వర్షాల (Rain) కారణంగా ప్రమాదం జరిగిందని, పరిస్థితిపై జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడినట్లు వెల్లడించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించినట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నానని సీఎం చంద్రబాబు ఎక్స్(Twitter) వేదికగా పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: అమెరికాలో విషాదం..! భార్య, కుమారుడిని చంపి టెక్కీ ఆత్మహత్య!

 

సింహాచలం దుర్ఘటన దురదృష్టకరం: పవన్ కల్యాణ్

సింహాచలంలో గోడ కూలడం కారణంగా క్యూ లైన్‌లో ఉన్న 8 మంది భక్తులు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. చందనోత్సవ వేళ ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానన్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. విశాఖపట్నం జిల్లా అధికారుల నుంచి ఈ ఘటన వివరాలు తెలుసుకున్నానని, భారీ వర్షాల మూలంగా గోడ కూలిందని తెలిపారన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించానని పవన్ కల్యాణ్ అన్నారు.

 

తీవ్ర ఆవేదనకు గురిచేసింది: మంత్రి లోకేష్

సింహాచలం లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద జరిగిన దుర్ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ ఘటనలో గాయపడిన వారికి విశాఖ కేజీ హెచ్ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోందని, బాధితులకు మెరుగైన చికిత్స కోసం అవసరమైతే ప్రైవేటు ఆసుపత్రులకు తరలించాల్సిందిగా యంత్రాంగాన్ని ఆదేశించామని చెప్పారు. పోలీసులు, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయ చర్యల్లో పాల్గొన్నాయని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి

 

అప్పన్న సన్నిధిలో అపశృతి..

కాగా సింహాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. చందనోత్సవం వేళ అప్పన్న సన్నిధిలో అపశృతి చోటు చేసుకుంది. రూ. 300 టికెట్ కౌంటర్ దగ్గర గాలి, వానకు గోడ కూలిపోయింది. ఈ ఘటనలో 8 మంది భక్తులు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. సంఘటన ప్రదేశానికి చేరుకున్న రిస్క్యూ సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న హోంమంత్రి అనిత, జిల్లా కలెక్టర్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా, పోస్టుమార్టం నిమితం మృతదేహాలను కేజీహెచ్‌ ఆస్పత్రికి తరలిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి:  టెన్షన్.. టెన్షన్! పాక్ సంచలన ప్రకటన! వచ్చే 24-36 గంటల్లో ఏ క్షణమైనా..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

6 లైన్లుగా రహదారి, డీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Simhachalam #Tragedy #APNews #WallCollapse #CMResponse #PawanKalyan #NaraLokesh #ExGratia